నీలగిరి, నవంబర్ 13 : బ్యూటీషియన్ కోర్సులో మహిళలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నల్లగొండ జిల్లా మేనేజర్ ఎ.అనిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం) నందు ఈ నెల 24వ తేదీ నుండి 45 రోజుల పాటు శిక్షణ కొనసాగనున్నట్లు వెల్లడించారు. 8వ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయిన అభ్యర్థులు, 18 నుండి 35 సంవత్సరాల వయస్సు గల వారు దరఖాస్తుకు అర్హులన్నారు. అర్హత పత్రాలు జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు రెండు, ఆధార్ జిరాక్స్‌తో మహిళా ప్రాంగణం నల్లగొండలో సంప్రదించాలన్నారు. ఇతర వివరాలకు 7660022517, 08682-244416 నంబర్లకు ఫొన్ చేసి సంప్రదించవచ్చని పేర్కొన్నారు.