ఉచిత కంటి వైద్యం శిబిరం అభినందనీయం : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్యం శిబిరం అభినందనీయం అని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం దేవరకొండ మండలం కొండభీమనపల్లి గ్రామంలో..
దేవరకొండ రూరల్, జూన్ 05 : గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్యం శిబిరం అభినందనీయం అని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం దేవరకొండ మండలం కొండభీమనపల్లి గ్రామంలో మునుకుంట్ల వెంకట్ రెడ్డి సౌజన్యంతో నిర్వహిస్తున్న ఉచిత మెగా కంటి వైద్య శిబిరంను ఆయన సందర్శించి పలువురికి కళ్లజోళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమాజ సేవా దృక్పథంతో ఈ క్యాంప్ ఏర్పాటు చేసిన మునుకుంట్ల వెంకట్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.
ప్రజల ఆరోగ్యం కోసం నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలు సమాజ అభివృద్ధికి ఎంతో దోహద పడతాయన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కంటి వ్యాధుల నివారణకు, ముందస్తు గుర్తింపునకు ఇటువంటి శిబిరాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. అనంతరం క్యాంప్ నిర్వాహకులు ఆయనను శాలువాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మునికుంట్ల వెంకట్ రెడ్డి, స్థానిక ఉప సర్పంచ్ కడారి సైదులు, బొడ్డుపల్లి కృష్ణ, వత్త్య బాలు, అప్పనాల తిరుమల, గుండాల వెంకట్, మల్లేష్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

