నకిరేకల్, అక్టోబర్ 15 : పేదరికాన్ని విద్యతో జయించవచ్చునని.. ఉన్నతమైన కల, జ్ఞాన సముపార్జన, నిరంతరం శ్రమ, పట్టుదల అనే నాలుగు నియమాలను అనుసరిస్తే ప్రతి విద్యార్థి జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చనేది భారతరత్న, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జీవితం నుండి మనం నేర్చుకోవాలని కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ తెలుగు శాఖాధిపతి, ఆచార్య పిల్లలమర్రి రాములు అన్నారు. బుధవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నకిరేకల్ లో నిర్వహించిన స్వర్ణ పతకాల ప్రదానం & ప్రపంచ విద్యార్థుల దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నకిరేకల్ ప్రాంతం ప్రతిభావంతులకు, ప్రగతిశీల భావజాలానికి పుట్టినిల్లు అని, ఇక్కడ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు నకిరేకల్ జ్ఞానధారను ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డా.జి.ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచేందుకు కళాశాలలో దాతల సహకారంతో మూడు గోల్డ్ మెడల్స్ ఇవ్వడం అభినందనీయమన్నారు. ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేట ప్రధానాచార్యులు రహత్ ఖానం మాట్లాడుతూ.. గ్రామీణ మహిళా విద్యార్థినులు వివక్షను ఎదిరించి ఉద్యోగం వచ్చేంతవరకు చదువును కొనసాగించాలన్నారు. ఎన్జీ కళాశాల ప్రధానాచార్యులు డా.ఎస్.ఉపేందర్ మాట్లాడుతూ.. నకిరేకల్ డిగ్రీ కళాశాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
స్వర్ణపతక దాతలు నోముల గోవింద రాజులు, బెల్లి నాగరాజు యాదవ్, చౌగాని యాదగిరి గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నతంగా ఎదిగేందుకే తమవంతు సహాయ సహకారాలు ఎల్లపపుడు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధానాచార్యులు డా.బెల్లి యాదయ్య, ప్రోగ్రాం కన్వీనర్ శ్రీనివాసాచారి, వైస్ ప్రిన్సిపాల్ నాగు, అధ్యాపకులు ప్రవీణ్ రెడ్డి, శ్రీనివాస్, హరిత, మధుసూదన్ రెడ్డి, శంకర్, రవీందర్, నర్సింహా చారి, శివశంకర్, ఉపేందర్, సుభాషిణి, కార్యాలయ సిబ్బంది వెంకన్న, సుదర్శన్, కార్తీక్, పుర ప్రముఖులు డా.సూర్యకుమార్, ఎస్ వి రావు, పరమేశ్ యాదవ్, బత్తిని వెంకన్న పాల్గొన్నారు. కళాశాల బి.ఏ, బి.కాం, బీఎస్సీ టాపర్స్ లోకేశ్, మాధవి, భవాని లకు గోల్డ్ మెడల్స్ అందించి ఒక్కొక్కరికి రూ.4,116/- నగదును అతిథుల చేతుల మీదుగా అందజేశారు.
Nakrekal : నాలుగు నియమాలతో ప్రతి విద్యార్థి అత్యున్నత స్థాయికి : ఆచార్య పిల్లలమర్రి రాములు
Nakrekal : నాలుగు నియమాలతో ప్రతి విద్యార్థి అత్యున్నత స్థాయికి : ఆచార్య పిల్లలమర్రి రాములు