కొండమల్లేపల్లి, అక్టోబర్ 17: జల్సాలకు అలవాటుపడి అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి అమాయక ప్రజలకు మోసగించిన కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు దేవరకొండ ఏఎస్పీ మౌనిక తెలిపారు. శుక్రవారం దేవరకొండ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధిక వడ్డీ పేరుతో ప్రజల నుంచి వందల కోట్లు సేకరించిన విష యం విదితమే. బాధితుల ఫిర్యాదు మేరకు క్రైమ్ నంబర్లు 153, 154, 157 కింద కేసులు నమోదు చేసి అమాయక ప్రజలకు అధిక వడ్డీ ఆశచూపి వందల కోట్లు వసూలు చేసిన పీఏపల్లి మండంలోని పలుగుతండాకు చెందిన బాలాజీనాయక్ అనుచరుడు రమావత్ చిరంజీవి కొండమల్లేపల్లిలోని నాగార్జున కాలనీలో 168 గజాల ఇల్లు, దిని విలువ 62 లక్షలు, తిరుమలగిరి మండలంలోని 167 గజుల ఇల్లు విలువ 69 లక్షలు, 16 లక్షల ఫార్చునర్ కారు, 12 లక్షల విలువ గల 15 తులల బంగారు ఆభరణాలు, 1.5 లక్షల ఐఫోన్, 1.70 టీఎస్ 05 ఎఫ్ఎం 5291 రేనాల్డ్ ట్రైబర్ కారును, రమావత్ సురేశ్ నాయక్‌ను అరెస్టు చేసి అతడి నుంచి కొండమల్లేపల్లిలోని నాగార్జున కాలనీలో 234 గజల స్థలంలో ఉన్న జి+1 ఇల్లు దిని విలువ రూ.90 లక్షలు, కొండమల్లేపల్లిలో 7 గంటలు భూమి దీని విలువ రూ.35 లక్షలు, మిర్యాలగూడలో 260 గజల భూమి దీని విలువ రూ.60 లక్షలు, రూ.18 లక్షల డౌన్‌పేమెంట్ గల టీఎస్05 సీ0099 పార్చునర్ కారు, రూ 20 లక్షల 20 తులల బంగారు ఆభరణాలు, 1.5 లక్షల విలువ గల ఐ ఫోన్, రమావత్ రమేశ్‌నాయక్ నుంచి కొండమల్లేపల్లి నాగార్జునకాలనీలోని 200 గజాల్లో ఉన్న ఇల్లు దీని విలువరూ.60 లక్షలు, మిర్యాలగూడలో 246 గజాల ఓపెన్ ప్లాట్, రూ.70 లక్షలు, రూ.20 లక్షల డౌన్‌పేమెంట్‌తో టీఆర్ 09 ఎం 0211 ఫార్చునర్ కారు. రూ 15 లక్షల విలువ గల 15 తులల బంగారు ఆభరణాలు, రూ.1.5 లక్షల విలువ గల ఐఫోన్, రమావత్ వినోద్ నుంచి కొండమల్లేపల్లిలోని నాగార్జున కాలనీలో 225 ప్లాట్‌లో రూ.35 లక్షలు, కొండమల్లేపల్లిలోని జేబీ కాలనీలో 233 గల ప్లాట్ రూ.20లక్షల 50 వేలు, రూ.12 లక్షలు డౌన్‌పేమెంట్ గల పార్చునర్ కారును నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ మౌనిక తెలిపారు. స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని కోర్టుకు సమర్పస్తామన్నారు. అధిక వడ్డీ వ్యాపారస్తులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధిక లాభాల ఆశతో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మోసపోవద్దని, ఇంక ఎవరైన మోసపోయి ఉంటే వెంటనే సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో కొండమల్లేపల్లి సీఐ నవీన్‌కుమార్, కొండమల్లేపల్లి, గుర్రంపోడు, పీఏపల్లి ఎస్ఐలు అజ్మీర రమేశ్, మధు, నర్సింహ నల్లగొండ స్పెషల్ టీమ్ ఎస్ఐ సంవత్ ఉన్నారు.
నీలగిరి, అక్టోబర్ 17: నాయక్ నహీ..ఖల్ నాయక్ నాహీ అన్నట్లుగా ఎక్కడున్నా నాకు అడ్డు లేదు అంటూ.. వడ్డీల వ్యాపారి బాలాజీనాయక్ జిల్లా జైలు నుంచే దండాలు మొదలు పెట్టినట్లు ఆడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల అధిక వడ్డీ ఆశతో రూ.45 కోట్లు కొల్లగొట్టిన ఏక్ నెంబర్ వడ్డీల వ్యాపారి బాలాజీనాయక్‌ను జిల్లా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. బాధితులు ఉంటే గుడిపల్లి పోలీస్ స్టేషన్లో ఆధారాలతో ఫిర్యాదులు చేయాలని జిల్లా ఎస్పీ ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేస్తే కుప్పలుకుప్పలుగా బాధితులు వస్తున్నారు. మరోవైపు జైలులో రిమాండ్‌లో ఉన్న బాలాజీనాయక్ ప్రభుత్వం కల్పించిన ఫోన్ సౌకర్యంతో అక్కడి నుంచి దందా కొనసాగిస్తూ అనుచరులు, ఏజెంట్లకు హుకుంలు జారీ చేస్తున్నాడు.
ఏజెంట్లకు కాన్ఫరెన్స్ కాల్ చేస్తూ బయటకు తీసుకవచ్చేందుకు ఎంత ఖర్చు అయినా ఫర్వాలేదు బెయిల్‌కు ఏర్పాటు చేయాలని ఆర్డర్స్ వేస్తున్నారు. మరోవైపు ఏజెంట్లు ఎట్టి పరిస్థ్ధితుల్లోపోలీసులకు దొరకవద్దని, అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆడియోలో ఉంది. ఒకవేళ దొరికనా ఎట్టి పరిస్థితులోనూ నోరు విప్పవద్దని హుకుం జారీ చేస్తున్నాడు. మరోవైపు బాలాజీ నాయక్ బయటికి రాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. జిల్లా జైలు సూపరింటెండెంట్ ప్రమోద్ను వివరణ కోరగా ఫోన్ రికార్డులకు జైలుకు సంబంధం లేదు. కుటుంబసభ్యు వల్లే వాయిస్ బయటకు వచ్చిందన్నారు.