కట్టంగూర్, ఏప్రిల్ 2 : బహుజన రాజ్యాన్ని స్థాపించిన తొలి పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గౌడ ఉద్యోగుల సంఘం ఐక్యవేదిక అధ్యక్షుడు యర్కల సత్తయ్య గౌడ్ అన్నారు. పాపన్న గౌడ్ 315 వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం నల్లగొండ జిల్లా కట్టంగూర్‌లో నిర్వహించారు. సంఘం నాయకులు సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పెద్ది బాలనర్సయ్య గౌడ్, పెద్ద గౌడ్ కొంపెల్లి యాదయ్య గౌడ్, పోగుల నర్సింహ్మ గౌడ్, మేడి ఇద్దయ్య, రెడ్డిపల్లి మనోహర్, రాచకొండ యాదయ్య గౌడ్, యర్కల లక్ష్మీనారాయణ గౌడ్, యర్కల మల్లేష్ గౌడ్, అంతటి శ్రీను గౌడ్, అయితగోని సత్యనారాయణ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, చౌగోని జనార్దన్ గౌడ్, కొంపల్లి లక్ష్మయ్య గౌడ్, యర్కల అంజయ్య గౌడ్, పోగుల రాజు గౌడ్, పెద్ది శివ గౌడ్ యర్కల శ్రీనివాస్ గౌడ్, బొమ్మగాని మహేశ్ గౌడ్, అంతటి నాగేశ్ గౌడ్, సాయి, శివ, గుండు రాములు పాల్గొన్నారు.