తుంగతుర్తి, జనవరి 26 : తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణానికి సోమవారం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో గ్రామ సర్పంచ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ పనుల కోసం వచ్చి పబ్లిక్ టాయిలెట్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజలందరి సౌకర్యార్థం ఈ పబ్లిక్ టాయిలెట్స్ నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంకినేని రవీందర్ రావు, ఉప సర్పంచ్ శ్రీను, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.