నల్లగొండ : దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ తండ్రి కనిలాల్ నాయక్ (Kanilal Naik) అనారోగ్యంతో శనివారం మృతి చెందారు.హైదరాబాద్లోని నిమ్స్ (NIMS) ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కనిలాల్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రవీంద్ర కుమార్ను ఓదార్చారు.రేపు దేవరకొండ మండలం స్వగ్రామం శేరిపల్లిలో కనిలాల్ అంత్యక్రియలు జరుగనున్నాయి.