చందంపేట (దేవరకొండ), మే 20 : దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తండ్రి, మాజీ సర్పంచ్ కనీలాల్నాయక్ మృతి బాధాకరమని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కనీలాల్నాయక్ ఇటీవల మృతిచెందగా.. సోమవారం దేవరకొండలోని ఆయన నివాసంలో రవీంద్రకుమార్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. కనీలాల్నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ పౌర సరఫరాల శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసి రిటైర్డ్ అయిన తర్వాత సర్పంచ్‌గా ఎన్నికై ప్రజా సేవ చేసిన కనీలాల్నాయక్ మృతి బాధాకరమన్నారు. నివాళులు అర్పించిన వారిలో జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్, బీఆర్ఎస్ నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి, టీవీఎన్ రెడ్డి, పల్లా ప్రవీణ్‌రెడ్డి, గాజుల ఆంజనేయులు, శ్రీనివాస్‌గౌడ్, శంకర్‌నాయక్, సత్యనారాయణ, దస్రూనాయక్, వెంకటయ్య, రాజు, కృష్ణ, తులసీరాం, ఇలియాస్, పటేల్, బాబా ఉన్నారు.