చౌటుప్పల్, డిసెంబర్17 : ప్రజా సమస్యలపై తగ్గేదే లేదని, నిరంతరం ప్రజల మధ్యే ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని బాలాజీ గార్డెన్స్‌లో నిర్వహించిన చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని, ప్రజా తీర్పును గౌరవిస్తానన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్య పడొద్దని సూచించారు. ఈ సందర్భంగా గెలిచిన ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో మంజూరైన నిధులు రూ.570 కోట్లను ఖర్చు చేసి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరారు. నియోజకవర్గంలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు అందించాలని సూచించారు. ఇందుకోసం తనవంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. లేనిచో సమస్యలపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. ఓటమికి కారణాలు విశ్లేషించుకొని ముందుకు సాగుతామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతి, జడ్పీటీసీ వీరమళ్ల భానుమతీవెంకటేశంగౌడ్, సింగిల్‌విండో చైర్మన్లు చింతల దామోదర్‌రెడ్డి, జక్కిడి జంగారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు గిర్కటి నిరంజన్‌గౌడ్, కత్తుల లక్ష్మయ్య, మున్సిపాలిటీ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, ఎండీ బాబాషరీఫ్, బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, గుండెబోయిన ఆయోధ్యయాదవ్, ముప్పిడి శ్రీనివాస్‌గౌడ్, కొత్త పర్వతాలుయాదవ్, ఢిల్లీ మాధవరెడ్డి, గుండెబోయిన వెంకటేశ్‌యాదవ్, కానుగుల వెంకటయ్య, ఆల్మాస్‌పేట కృష్ణయ్య పాల్గొన్నారు.