అర్వపల్లి, జూలై 03 : అర్వపల్లి మండల పరిధిలోని కొమ్మల గ్రామంలో మాజీ జడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్ బామ్మర్ది బయ్య మధు యాదవ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించాడు. విషయం తెలిసిన తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ శుక్రవారం బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి మధు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు గుండగాని సోమేష్ గౌడ్, మొరిశెట్టి ఉపేందర్, కర్నాటి వెంకన్న, రామలింగయ్య, రాoకోటి, సోమిరెడ్డి సతీష్, కార్యకర్తలు ఉన్నారు.