నకిరేకల్, మే 23 : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ నియోజకవర్గ కేంద్రం లో శుక్రవారం నిర్వహించనున్న సన్నాహక సమావేశానికి పట్టభద్రులు భారీ సంఖ్యలో తరలి రావాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎన్నికల నియోజకవర్గ ఇన్చార్జి రాంబాబు యాదవ్ పిలుపునిచ్చారు. నకిరేకల్‌లోని పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 27న జరుగనున్న వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
పట్టణంలోని మూసీ రోడ్డులో ఉన్న సువర్ణ గార్డెన్స్‌లో ఉదయం 10గంటలకు పట్టబధ్రుల ఓటర్లతో సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హాజరు కానున్నట్లు తెలిపారు. పట్టభద్రులు, మేధావులు, విద్యావంతులు, బీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు, బూ త్ ఇన్చార్జీలు, ముఖ్య నాయకులు అధిక సంఖ్యలో హాజ రు కావాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు ప్రగడపు నవీన్‌రావు, యల్లపురెడ్డి సైదిరెడ్డి, నాయకులు యాదగిరి, సదానందం, ప్రభాకర్, పరమేశ్ పాల్గొన్నారు.