నల్లగొండ, మే 28 : బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జమాల్ ఖాద్రి తండ్రి, లతీఫ్ సాహెబ్ దర్గా మూతవలి జనాబ్ రషీద్ అలీ ఈ రోజు ఉదయం మరణించారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి నల్లగొండలోని నివాసంలో వారి పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్య వచనాలు చెప్పి.. తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నివాళులర్పించిన వారిలో మాజీ ఆర్ఓ మాలే శరణ్య రెడ్డి, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, సీనియర్ నాయకులు బక్క పిచ్చయ్య, సింగం రామ్మోహన్, కొండూరు సత్యనారాయణ, మారగోని గణేశ్, మెరుగు గోపి, గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి, కందుల లక్ష్మయ్య, జె. వెంకట్ రెడ్డి, ఊట్కూరు సందీప్ రెడ్డి దయాకర్ ఉన్నారు.