నల్లగొండ, ఆగస్టు 12: నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 520, 530 అడుగుల్లో నీరున్నా ఉదయ సముద్రాన్ని మత్తడి దుంకించటంతోపాటు ప్రతి ఏఎమ్మార్పీ కింద ఉన్న చెరువులను నింపినం. మీరు అధికారంలోకి వచ్చిన ఈ రెండేండ్లలో ఈ ప్రాజెక్టు కింద రైతులకు సాగు నీరివ్వటం లేదెందుకని మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిలను మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యుడు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు.
మంత్రులకు కమీషన్లపై ఉన్న ఆసక్తి రైతులపై లేనందునే రెండేండ్లుగా నల్లగొండ, నకిరేకల్, దేవరకొండ, సాగర్ నియోజకవర్గాల్లో పం టలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మోటా ర్లు రిపేర్ చేసి ప్రతి ఎకరాకు సాగు నీరివ్వాలని, లేదంటే రైతులతో కలిసి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. మంగళవారం మాజీ శాసన సభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి ఉదయ సముద్ర ప్రాజెక్టును సందర్శించి, నీటి నిల్వలను పరిశీలించారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మత్తడి దుంకే లెవల్లో నీటి నిల్వలు ఉన్నాయని, గత ఏడాది నుంచి ప్రాజెక్టును నింపనందునే కిందికి సాగు నీరు వచ్చే పరిస్థ్దితి లేదన్నారు. ప్రాజెక్ట్‌ను మీడియాకు చూపుతూ వాటర్ లెవల్స్‌పై వివరించారు. అనంతరం ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, కంచర్ల, ఇతర బీఆర్ఎస్ నాయకులతో జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
సాగర్ ప్రాజెక్టులో గతేడాది నుంచి నీటి నిల్వలు ఎక్కువకావడంతో సముద్రం పాలు చేస్తున్నారు తప్ప ఏఎమ్మార్పీ ఎందుకు నింపటం లేదని ప్రశ్నించారు. క్రస్ట్ గేట్లు ఎత్తడానికి, ప్రాజెక్టు నిండిన తర్వాత పులిచింతల నింపి, అక్కడ నుండి సముద్రం పాలు చేసేందుకు మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ ఉత్సాహం చూపుతున్నారు తప్ప, జిల్లా రైతాంగానికి సాగునీటిని అందించేందుకు ఆసక్తి చూపడంలేదని ఆరోపించారు.
సాగునీటిపై చర్చకు సిద్ధం
గతం కంటే తామే ఎక్కువ పంటలు పండించామని గొప్పలు చెప్పుకోవడం కాదని, పదేండ్లల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత నీరిచ్చింది, ఎంత పంట పం డించాం అనే దానితోపాటు ఏఎమ్మార్పీపై చెరువు వద్దనే చర్చపెడదామన్నారు. సాగునీటి విషయంలో అసత్యాలు చెబితేచెరువులో దుంకడానికైన సిద్ధమని, నీవు కూడా సిద్ధ్దమా? అని కోమటిరెడ్డికి సవాల్ విసిరారు. పొరుగు రాష్ట్ర సీఎం మెప్పు కోసం, బనకచర్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని, ప్రణాళికా బద్ధ్దంగా లేదని సొరంగం పేరుతో ఎనిమిది మంది మృతికి కారణమైంది మీరు కాదా? అని ప్రశ్నించారు.
ఆర్అండ్బీ అతిథి గృహాన్ని క్యాంప్ ఆఫీస్‌గా మార్చటం సరికాదు
నల్లగొండలో క్లాక్ టవర్ వద్ద నిర్మించిన గెస్ట్ హౌస్‌ను ఎమ్యెల్యే క్యాంప్ కార్యాలయంగా వినియోగించడం సరికాదని, గతంలో నిర్మించిన క్యాంపు కార్యాలయాన్నే వినియోగించాలన్నారు. అతిథుల కోసం వినియోగించే భవనాన్ని ఆధునీకరించాలనే ఆలోచనతో నాటి సీఎం కేసీఆరే నిధులు మంజూరు చేశారన్నారు. నిర్మించిన దానిని నేడు క్యాంప్ ఆఫీస్‌గా వినియోగించడం సరికాదన్నారు.
సొరంగం విషయంలో బీఆర్ఎస్ వాళ్ల్లే క్షుద్ర పూజలు చేయడం వల్లే మృత్యువాతపడ్డారని, అందుకనే ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లడంలేదన్న ఆరోపణలపై జగదీశ్‌రెడ్డి స్పందించారు. క్షుద్ర పూజల చేశారనే ఆరోపణలను కోమటిరెడ్డి నిరూపించాలన్నారు. నిరూపించకుంటే శిక్షార్హుడైతాడని, లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నిరంజన్ వల్లి, బోనగిరి దేవేందర్, తండు సైదులు గౌడ్, కటికం సత్తయ్య గౌడ్, మాలె శరణ్యారెడ్డి, సింగం రామ్మోహన్, అభిమన్యు శ్రీనివాస్, బక్క పిచ్చయ్య, చీర పంకజ్ యాదవ్, వంగాల సహదేవ్ రెడ్డి, రావుల శ్రీనివాస రెడ్డి, తుమ్మల లింగస్వామి, కందుల లక్ష్మయ్య, పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, ఐతగోని యాదయ్య, దేప వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
పదేండ్ల తర్వాత మళ్లీ నీళ్ల్ల కోసం రైతులు ధర్నాలు
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో 520 అడుగుల స్థ్దాయిలో నీటి నిల్వలు ఉన్న ఎడమ కాల్వతో పాటు ఏఎమ్మాఆర్ హైలెవల్, లోలెవల్ ప్రాజెక్టులకు డి-25 నుంచి డి-49వరకు నీరిచ్చేవారమన్నారు. 3.30లక్షల ఎకరాలు సాగుకు ప్రతీ సీజన్లో నీరు ఉండేలా చర్యలు తీసుకున్నామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లల్లో కనీసం వానాకాలం సీజన్లో కూడా నీరివ్వని దుస్థితికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు.
ప్రధానంగా మంత్రి కోమటిరెడ్డి నియోజక వర్గంలోని డి 37 నుండి డి-40వరకు 57వేల ఎకరాలకు బిఆర్ఎస్ ప్రభుత్వం సాగు నీరందిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు కూడా ఇచ్చే పరిస్థ్దితిలో లేకపోవటం సిగ్గుచేటని విమర్శించారు. మారుమూల పల్లెలైన ముషంపల్లి, సర్వారం, ఇందుగుల, తోపుచర్ల గ్రామాలకు కూడా నీరిచ్చిన చరిత్ర తమదని, అయితే కాల్వకు ఆనుకొని ఉన్న గ్రామాలకు కూడా ఇవ్వకపోతే చెర్ల గౌరారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత సోషల్ మీడియాలో ప్రచారం చేసిన విషయం తెల్వదా? అని కోమటిరెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్ల్లే పదేండ్ల తర్వాత రైతులు మళ్లీ రోడ్డెక్కి సాగునీటి కోసం ధర్నాలు చేసే పరిస్థ్దితి దాపురించిందని మండిపడ్డారు. సాగునీరు ఇవ్వకపోతే తామే రైతులతో కలసి ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.
ఏఎమ్మార్పీతోనే నాలుగు నియోజకవర్గాలకు సాగునీరు
ఏఎమ్మార్పీ ప్రాజక్ట్ట్ను నిర్లక్ష్యం చేయటంతో నల్లగొండ, నకిరేకల్‌తో పాటు దేవరకొండ, నాగార్జున సాగర్ నియోజక వర్గాల్లోనూ సాగు నీరు అందకపోవటంతో వేలాది ఎకరాలు ఎండుతున్నాయన్నారు. రోడ్ల విస్తరణ పేరుతో కమీషన్లు దండుకుంటున్న మంత్రికి రైతులు కమీషన్లు ఇవ్వనందునే సాగు నీరు ఇవ్వడం లేదని ఈ విషయాన్ని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు.
హెలికాప్టర్ రాక అరగంట ఆలస్యానికే అలిగి వెళ్ల్లిన నీకు రెండేండ్లుగా నల్లగొండ రైతాంగం సాగు నీటి కోసం ఎదురుచూస్తున్న విషయం పట్టదా అని అన్నారు. చిట్‌చాట్‌లో అబద్దాలను నిజాలని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తే ఎవరూ నమ్మబోరన్నారు. ఇకనైనా నిర్లక్ష్య వైఖరివీడి సాగర్ బ్యాక్ వాటర్ ద్వారా ఏఎమ్మార్పీ కింద ఆయకట్టుకు సాగునీరివ్వడంతో పాటు చెరువులన్నీ నింపాలని డిమాండ్ చేశారు. ప్రాజక్టు కింద వారబందీ పద్ధ్దతిలోనే నీరివ్వగలమని, చెరువులు నింపలేమని అధికారులే ప్రకటించడమంటే వారు పూర్తిగా విఫలమయినట్టే అని విమర్శించారు.