పాలనలో పారదర్శకతతోనే అవినీతి నిర్మూలన
ప్రభుత్వ పాలన పారదర్శకంగా అందేందుకు సమాచార హక్కు చట్టం ఎంతో ఉపయోగపడుతుందని సమాచార ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు.
- సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు
కోదాడ టౌన్, మార్చి 8: ప్రభుత్వ పాలన పారదర్శకంగా అందేందుకు సమాచార హక్కు చట్టం ఎంతో ఉపయోగపడుతుందని సమాచార ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని ఎమ్మెస్ కళాశాలలో సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణారెడ్డి అధ్వర్యంలో నిర్వహించిన సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులు అవినీతికి అస్కారం లేకుండా పని చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పనులు జరిగినా, వెంటనే ఆర్టీఏ కార్యకర్తలు అవినీతిని బయటకు తీసుకురావాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఒంటెద్దు పోకడలను ప్రస్తుత సమాజంలో ఉన్న మేధావులు, యువకులు ప్రశ్నించాలన్నారు.
అధికారులు లంచం అనే మాట ఎత్తితే వెంటనే ప్రజలు ఆర్టీఏ కార్యకర్తలకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు వికాస సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి చేకూరి శివ, జిల్లా ఉపాధ్యక్షుడు విక్టర్ బాబు, నియోజకవర్గ అధ్యక్షుడు ఏసు పాదం, జిల్లా సహాయ కార్యదర్శి కిన్నెర ఉపేందర్, కోదాడ పట్టణ అధ్యక్షుడు గంధం పాండు, కార్యదర్శి మాతంగి శ్రీను, నకిరేకంటి నాగేంద్రబాబు, రశీద్, పాతకోటి రామారావు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Muscle Growth | 30 ఏళ్లు దాటిన తరువాత కండరాల నిర్మాణం సాధ్యం కాదా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Election Commission | ఎన్నికల సంఘానికి మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మద్దతు.. 124 మంది బహిరంగ లేఖ
Priyanka Gandhi | ‘దేశంలో ప్రజాస్వామ్యం లేదా..?’ కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంకాగాంధీ ఫైర్
నాలుగోసారి ‘మిస్టర్ సింగరేణి’గా రామకృష్ణ
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

