నల్లగొండ రూరల్, జూలై 10 : మేరా యువ భారత్ నల్లగొండ జిల్లా సమన్వయ కమిటీని, జిల్లా అడ్వైజర్ కమిటీ, యాక్షన్ ప్లాన్ 2026-27 కు సంబంధించిన సమావేశాన్ని జిల్లా కలెక్టరేట్లో డీవైఎస్ఓ అక్బర్ అలీ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. గత సంవత్సరం జరిగిన కార్యక్రమాలు, ప్రస్తుతం నిర్వహించాల్సిన వాటిపై చర్చించారు. అనంతరం మై భారత్ ఇన్తెన్సివ్ రిజిస్ట్రేషన్ డ్రైవ్ పోస్టర్ను డి వై ఎస్ ఓ సమక్షంలో ఆవిష్కరించారు. ఇందులో ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా జిల్లా యువత పోర్టర్ లో అధిక మొత్తంలో రిజిస్ట్రేషన్ కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ ఆఫీసర్ గౌతమ్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ వెంకటరమణారెడ్డి, అకౌంట్స్ ప్రోగ్రాం అసిస్టెంట్ భాను చందర్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి దస్రు, కళాశాల ప్రిన్సిపాల్స్ ఘనశ్యమ్, పద్మ, ఉపేందర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కరుణాకర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ యూత్ వాలంటీర్స్ పాల్గొన్నారు.