దేవరకొండ రూరల్, జూలై 14: మండలంలోని ముదిగొండ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ కావడంతో 35 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన మండలంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ పాఠశాలలో సుమారు 310 మంది విద్యార్థినులు చదువుతున్నారు. విద్యార్థినులు, స్థానికులు అందించిన సమాచారం మేర కు ఆదివారం సాయంత్రం విద్యార్థినులకు స్నాక్స్, పెసర గుగ్గిళ్లు అందజేశారు. రాత్రి బగారాతో చికెన్ భోజనం పెట్టా రు.
రాత్రి భోజనం తిన్న తర్వాత, కొం త మంది విద్యార్థినులు కడుపునొప్పి, విరోచనాలతో బాధపడ్డారు. సోమవా రం ఉదయం అల్పాహారంగా పులిహోర తిన్న తర్వాత 35 మంది తీవ్రమైన కడుపునొప్పి, విరేచనాలతో బాధపడ్డారు. దీంతో పాఠశాల ఏఎన్ఎం, టీచర్లు, 13 మంది విద్యార్థినులను దేవరకొండ దవాఖానలో 22 మందిని తూర్పుపల్లి పీహెచ్సీలో చేర్పించారు. విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలియజేయడంతో తల్లిదండ్రులు, ఉ పాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న ఆర్డీవో రమణారెడ్డి, పలు విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థినులను పరామర్శించా రు. అనంతరం ఆర్డీవో పాఠశాలను సం దర్శించి వివరాలు తెలుసుకున్నారు.
మాజీఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఆగ్రహం
గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ జరగడంపై మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరుగుతున్నా రేవంత్ సర్కారు మొద్దు నిద్ర వీడటం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, 60 మంది చనిపోయారని పేర్కొన్నారు. విద్యావ్యవస్థ కుప్పకూలిందని అన్నారు. విద్యార్థులు చనిపోతున్నా ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదన్నారు. కేసీఆర్ హయాంలో విద్యావ్యవస్థ పారదర్శంగా ఉండేదన్నారు.
డీటీడబ్ల్యూవోను తక్షణమే తొలగించాలి..
గిరిజన సంక్షేమ శాఖ అధికారిని తక్షణ మే విధుల నుంచి తొలగించాలి. ఇంత పెద్ద ఘటన జరిగినా కనీసం దవాఖాన వైపు కన్నెత్తి చూడకపోవడానికి గల కా రణమేమిటో తెలియదు. ఆశ్రమ పాఠశాలలో వార్డెన్లు, ప్రధానోపాధ్యాయు లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వి ద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నా రు. ఘటనకు సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
– వేముల రాజు, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు