కోదాడ రూరల్, ఏప్రిల్ 5 : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. స్టేషన్ పరిసరాల్లో గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకు నిప్పు పెట్టడంతో రవ్వలు ఎగిసిపడి స్టేషన్ ప్రాంగణంలోని వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు అంటుకున్నాయి. పోలీసుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు.
ప్రమాదంలో స్టేషన్ యార్డులోని మూడు ఆటోలు, ఒక సుమో, కారు, ట్రాలీ ఆటో పాక్షికంగా కాలాయి. స్టేషన్ పక్కనే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంకు ఉండడంతో మంటలు ఎగిసిపడిన సమయంలో ప్రజలు, పోలీసులు ఆందోళనకు గురయ్యారు. మంటలు ఆదుపులోకి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.