దేవరకొండ, సెప్టెంబర్ 19 : ఎనిమిదేండ్ల క్రితం అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కాల్వలో ప్రమాదవశాత్తు పడి పీఏ పల్లి మండలంలోని వద్దిపట్ల గ్రామ పంచాయతీ పరిధి పడమటితండాకు చెందిన 09 మంది చనిపోయారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఆర్థిక సాయం ప్రభుత్వం నుండి మంజూరైంది. చెక్కులను బాధిత కుటుంబాలకు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమణా రెడ్డి, మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, తెర సత్యం రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లయ్య యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొడ్య నాయక్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొర్ర రాంసింగ్ నాయక్, మాజీ సర్పంచ్ జబ్బర్ లాల్, సీతారాం, అయ్యన్న యాదవ్, యువ నాయకుడు శ్రీరామ్ నాయక్, అధికారులు పాల్గొన్నారు.