నల్లగొండ రూరల్, జనవరి 27 : నల్లగొండ మండలంలోని వెలుగుపల్లి గ్రామానికి చెందిన నాగార్జున రాములు చారి అనారోగ్యంతో మరణించారు. ఆయన కుటుంబానికి వెలుగుపల్లి గ్రామానికే చెందిన డోకూరు ప్రభాకర్ రెడ్డి 10 వేల ఆర్థిక సహాయాన్ని పోతేపాక కిరణ్ కుమార్ ద్వారా పంపగా మంగళవారం కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో మెండు మణిపాల్ రెడ్డి, కండె యాదగిరి, కొప్పోజు సైదాచారి, చిన్నాల వంశీ, బోగోజు రామాచారి, పాలకూరి వెంకటేశం, పొతేపాక రాజశేఖర్ పాల్గొన్నారు.