HomeNalgondaField Experience For Students With Rural Trips
గ్రామీణ పర్యటనలతోనే విద్యార్థులకు క్షేత్రస్థాయి అనుభవం
వ్యవసాయ విద్యార్థులు గ్రామీణ పర్యటనలతోనే క్షేత్రస్థాయి అనుభవాన్ని పొందుతారని గడ్డిపల్లి కేవీకే ఇన్చార్జి పీసీ బి.లవకుమార్ అన్నారు
కేవీకే ఇన్చార్జి పీసీ లవకుమార్
గరిడేపల్లి, డిసెంబర్ 26 : వ్యవసాయ విద్యార్థులు గ్రామీణ పర్యటనలతోనే క్షేత్రస్థాయి అనుభవాన్ని పొందుతారని గడ్డిపల్లి కేవీకే ఇన్చార్జి పీసీ బి.లవకుమార్ అన్నారు. హర్యానా రాష్ట్రం పీడీఎం యూనివర్శిటీలో అగ్రికల్చర్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మండలంలోని గడ్డిపల్లి కేవీకేను సోమవారం గ్రామీణ కృషి అనుభవంలో భాగంగా సందర్శించారు. ఈ సంద ర్భంగా విద్యార్థులకు కేవీకే ఇన్చార్జి పలు సూచ నలు చేశారు. విద్యార్థులు మూడేండ్ల పాటు తరగతి గదుల్లో నేర్చుకున్న విషయాలను ప్రత్యక్షంగా పరిశీలించి అనుభవం పొందుతారని పేర్కొన్నారు.
మూడు నెలల పాటు గ్రామాల్లోనే ఉంటూ కేవీకే శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఆతిథ్య రైతుల పంట పొలాలను పరిశీలిస్తూ రైతులు అనుసరిస్తున్న వ్యవసాయ పద్ధతులను తెలుసుకోవాలన్నారు. రైతులకు నూతన సాంకేతిక విధానాలను వివరించాలని సూచించారు.
అనంతరం విద్యార్థులు కేవీకేలోని పలు క్షేత్రాలను సందర్శించి వాటికి సంబంధించిన వివరాలను శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డి.నరేశ్, ఎ.కిరణ్, విద్యార్థులు పాల్గొన్నారు.