శాలిగౌరారం, జనవరి 20 : శాలిగౌరారం మండలంలోని అంబారీపేట గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ ఎర్ర బుచ్చయ్య (50) మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలిసిన జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వై.శేఖర్ రెడ్డి గ్రామానికి చేరుకుని బుచ్చయ్య మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ప్రభుత్వం నుండి తగిన తోడ్పాటును అందించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఆయనతో పాటు శాలిగౌరారం ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, ఏపీఓ జంగమ్మ, మండలంలోని ఫీల్డ్ అసిస్టెంట్లు సంతాపం వ్యక్తం చేశారు. బుచ్చయ్యకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.