కట్టంగూర్, సెప్టెంబర్ 03 : విద్యార్థినులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు అన్నారు. ఎస్ జీఎఫ్ మండల స్థాయి అండర్ 14–17 విభాగాల బాలికల కబడ్డీ, కోకో, వాలీబాల్ క్రీడా పోటీలను బుధవారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో ఇన్చార్జి ఎంఈఓ అంబటి అంజయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు దేహదారుఢ్యం పెంపొందిస్తాయన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు నియోజకవర్గ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ సభ్యులు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్ల క్లబ్ అధ్యక్షుడు చిక్కు శేఖర్, శంభులింగారెడ్డి, రెడ్డిపల్లి సాగర్, కల్లూరి వెంకటేశ్వర్లు, వినోద్ కుమార్, శ్రీనివాస్, శేఖర్ రెడ్డి, పీఈటీలు చింతకాయల పుల్లయ్య, మాణిక్యం, జగదీష్ పాల్గొన్నారు.