ఎదురు చూపులే.. అందని వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు
మండలంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ఏండ్లతరబడి రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్నా నేటికీ అతీగతి లేకపోవడంతో కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే నాథేడే కరువయ్యాడు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం డీడీలు చెల్లించి దరఖాస్తు చేసుకున్న రైతులకు ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయాల్సి ఉంటుంది.
- కార్యాలయం చుట్టూ రైతుల ప్రదక్షిణలు
- అంతుచిక్కని అధికారుల వ్యవహార శైలి
నిడమనూరు, ఆగస్టు 7 : మండలంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ఏండ్లతరబడి రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్నా నేటికీ అతీగతి లేకపోవడంతో కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే నాథేడే కరువయ్యాడు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం డీడీలు చెల్లించి దరఖాస్తు చేసుకున్న రైతులకు ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయాల్సి ఉంటుంది. ఇవేవీ లేకుండానే ముడుపులు చెల్లించిన వారికి ట్రాన్స్ఫార్మర్లు బిగించడం, మంజూరైన వాటిని నిబంధనలకు విరుద్ధంగా ఇతర చోట్లకు తరలించడం వంటి అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నట్లు ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. సీజన్ నెత్తిమీదకు రావడంతో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్(త్రీఫేజ్)తో సాగుకు రైతులు వేయికండ్లతో ఎదురు చూస్తున్నారు.
వ్యవసాయానికి విద్యుత్ కనెక్షన్ అనివార్యం కావడంతో అధికారుల తీరు రైతుల పాలిటి శరాఘాతంలా మారుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల నుంచి స్థాయికి మించి ముడుపులు ఆశించిన అధికారులు ఇచ్చుకోలేని రైతులపై ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్నట్లు పలువురు ‘నమస్తే’ ఎదుట వాపోయారు. గతంలో మంజూరు లేకుండానే ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం, మంజూరైన వారికి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వకపోవడం వంటి అక్రమాలపై ఫిర్యాదులు వెళ్లడంతో ఏఈ శరత్, సిబ్బంది ఇరువురిని విధుల నుంచి తొలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. వ్యవసాయ అవసరాల కోసం నిత్యం అధికారుల చుట్టూ తిరుగుతున్నా, కనీసం వర్క్ ఆర్డర్లు కూడా ఇవ్వలేని పరిస్థితితో రైతులు అరిగోస పడుతున్నారు. మండలంలో ఇప్పటికే సుమారు 300 వరకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కోసం అంచనా ప్రతిపాదనలు పంపినట్లు అధికారిక గణాంకాలు చెప్తున్నా అవస్థలు తప్పడం లేదని ఆయా గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు.
డీడీ చెల్లించిన..
వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం 2024లో ఐదుగురు రైతులం డీడీలు చెల్లించి దరఖాస్తు చేసుకున్నాం. నేటికీ మాకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మంజూరు కాలేదు. మాకంటే వెనుకాల ముడుపులు చెల్లించిన రైతులకు ట్రాన్స్ఫార్మర్ మంజూరైంది. అధికారులు రైతులకు కనీస సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ అవసరాలకు విద్యుత్ సరఫరా కాకపోవడంతో నరకయాతన పడుతున్నాం. ఉన్నతాధికారులు దృష్టి సారించి ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయాలి.
-గంగుల ఆంజనేయులు, తుమ్మడం గ్రామ రైతు
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

