చందంపేట, జనవరి 19 : నల్లగొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి స్టేజి వద్ద రైతులు యూరియా కోసం ధర్నా నిర్వహించారు. గత వారం రోజుల నుండి రైతులు యాప్లో బుక్ చేస్తున్నప్పటికీ యూరియా నిల్ అని రావడంతో విసుగు చెందిన రైతులు సోమవారం పోలేపల్లి గేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. సుమారు 2 గంటల పాటు రైతులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో రహదారికి ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసుల జోక్యంతో రైతులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో రైతులు సైదులు, మోహన్, జానెర్దన్, రజని, తదితరులు పాల్గొన్నారు.