మునుగోడు, ఏప్రిల్ 08 : ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మునుగోడు మండలంలోని మునుగోడు, కొరటికల్, గూడపూర్, పులిపలుపుల, ఊకోండి, కచలాపురం గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తాలు, మట్టి పెల్లలు లేకుండా వడ్లు ఆరబెట్టుకుని తీసుకువచ్చి ప్రభుత్వం అందించే ఏ గ్రేడ్ రకం రూ.2,320 మద్దతు ధర పొందాలని సూచించారు. సన్న వడ్లు పండించే రైతులకు క్వింటాకు అదనంగా రూ.500 బోనస్ అందిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాల్వాయి చెన్నారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు భీమనపల్లి సైదులు, పార్టీ జిల్లా నాయకులు వేమిరెడ్డి జితేందర్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.