ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చి ప్రోత్సహిస్తున్న ఆయిల్‌పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి
మోత్కూరు, ఫిబ్రవరి 17 : రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చి ప్రోత్సహిస్తున్న ఆయిల్‌పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పాలడుగు ఆయిల్‌ఫెడ్ నర్సరీలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్, ఉద్యాన వన శాఖ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా రైతులకు ఆయిల్‌పామ్ మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో వారు మాట్లాడుతూ.. దేశంలో 22 వేల మిలియన్ టన్నుల వంట నూనెలు అవసరం ఉండగా, కేవలం 7 వేల మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతుందన్నారు. రాష్ట్రంలో ఎక్కువ మంది రైతులు ఆయిల్‌పామ్‌ను సాగు చేసేందుకు ఆసక్తి చూపాలన్నారు. సన్న, చిన్నకారు రైతులకు వంద శాతం సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగైందని, ఈ ఏడాది 1.24 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేశారన్నారు. ఆయిల్ రికవరీలో19.3 శాతం ఆయిల్ ఫెడ్ దేశంలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఇప్పటికే కాళేశ్వరం జలాలతో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఆయిల్‌ఫెడ్ ఎండీ సురేందర్, జీఎం సుధాకర్‌రెడ్డి, జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి అన్నపూర్ణ, మోత్కూరు, అడ్డగూడూరు ఎంపీపీలు రచ్చ కల్పన, దర్శనాల అంజయ్య, జడ్పీటీసీ గోరుపల్లి శారదాసంతోష్‌రెడ్డి, మున్సిపల్ చైరపర్సన్ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొణతం యాకూబ్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు కంచర్ల అశోక్‌రెడ్డి, పొన్నాల వెంకటేశ్వర్లు, వెంకట్‌రెడ్డి, రైతు బంధు సమితి కో ఆర్డినేటర్లు కొండ సోంమల్లు, మేఘారెడ్డి సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాంపాక నాగయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు రమేశ్, ప్రభాకర్‌రెడ్డి, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

