అనంతగిరి, ఏప్రిల్ 08 : కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన ధాన్యం ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల తాసీల్దార్ హిమబిందు అన్నారు. మంగళవారం మండలంలోని శాంతినగర్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. రైతులు తేమ లేని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంకు తీసుకురావాలని, నాణ్యమైన ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర దొరుకుతుందన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఎం లక్ష్మి, మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ అనూష, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు శ్రీనివాస్ రెడ్డి, కొండపల్లి వాసు, డేగ కొండయ్య, బాబునాయక్ పాల్గొన్నారు.