ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకునేలా.. రైతులకు అవగాహన కల్పించాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాల లబ్ధిని పొందేందుకు జిల్లాలో ఉన్న రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకునేలా అవగాహన కల్పించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
- నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్
నీలగిరి, ఫిబ్రవరి 18: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాల లబ్ధిని పొందేందుకు జిల్లాలో ఉన్న రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకునేలా అవగాహన కల్పించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో వ్యవసాయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లాలో మొత్తం 5,54,347 మంది పట్టాదారు పాసు పుస్తకాలు కలిగిన రైతులు ఉన్నారని, ఇప్పటివరకు 2 లక్షల 41 వేల 39 మంది రైతులు మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, తకిన రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఇందుకు రైతులకు అవగాహన కల్పించాలని, మీ-సేవ లేదా వ్యవసాయ విస్తరణ అధికారుల దగ్గర లాగిన్ చేసుకోవాలని చెప్పారు. దీని వల్ల కేంద్ర పథకాలతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాల కింద రైతులు లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. వ్యవసాయ రంగం మొత్తం డిజిటలైజేషన్ చేయనున్న దృష్ట్యా ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అవుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించి.. అందరూ రిజిస్ట్రేషన్ అయ్యేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయ అధికారి శ్రవణ్, మండల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

