పెన్పహాడ్, నవంబర్ 04 : పెన్పహాడ్ మండలం సింగారెడ్డిపాలెం రైతులు వారి గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం తాసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ రాధా, మహిళా సమాఖ్య కార్యాలయంలో ఏపీఎం అంజయ్యకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గ్రామంలో ఆరు సంవత్సరాల నుండి సంఘ బంధ సభ్యుల ఆధ్వర్యంలో ఐకేపీ కేంద్రాన్ని విజయవంతంగా నడిపించినట్లు తెలిపారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా తమ గ్రామంలో ఐకేపీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి తమ సమస్యలను తీర్చాలని కోరారు. వేరే గ్రామానికి వెళ్లి ధాన్యం అమ్మాలంటే ఇబ్బందులు తలెత్తుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాగలింగం, పేర్ల లింగయ్య, హేమాద్రి, నల్లయ్య, సైదులు, గుండాల లింగయ్య, ఖమాంపటి లింగయ్య, గోపి, రామయ్య, పేర్ల వెంకన్న, చిన్న నాగయ్య, మహేశ్, సైదులు పాల్గొన్నారు.

Penpahad : ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని సింగారెడ్డిపాలెం రైతుల వినతి