గుర్రంపోడ్, మే 6 : మండలంలోని లక్ష్మీదేవిగూడెం కొనుగోలు కేంద్రం పరిసరాల్లో మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో ధాన్యం తడవడంతో రైతులు ఆందోళనకు దిగారు. లారీల కొరతతో రోజలు తరబడి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోయారు. కొనుగోలు కేంద్రం పకన నల్లగొండ-దేవరకొండ ప్రధాన రహదారిపై కొద్దిసేపు రాస్తారోకో చేసి నిరసన తెలిపారు.
తన 260 బస్తాల ధాన్యం కాంటా వేసి ఐదు రోజులు గడిచిందని, ఇప్పుడు కురిసిన వర్షంతో బస్తాలు తడిచాయని, మళ్లీ ఆరబెట్టాల్సి రావడం భారంగా మారుతుందని రైతు నాగులవంచ శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రం మానిటరింగ్ అధికారి కమలాకర్ రేపటి నుంచి లారీలు సరిపడా వస్తాయని, వారంలో కేంద్రం ఖాళీ చేస్తామని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.