అర్వపల్లి, సెప్టెంబర్ 10 : యూరియా కోసం రైతుల ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం అర్వపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘానికి సుమారు 600 బస్తాల యూరియా రావడంతో తెల్లవారుజాము నుండే వెయ్యి మంది రైతులకు పైగా ఆధార్ కార్డులు తీసుకుని వచ్చారు. గంటల తరబడి ఎండలో క్యూ లైన్లలో నిలబడ్డారు. ఒక్కొక్కరికి ఒక్క బస్తా చొప్పున ఇవ్వడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది రైతులకు యూరియా దొరకపోవడంతో బాధతో వెనుతిరిగారు. వెయ్యి మంది రైతులకు పైగా యూరియా కోసం పడి కాపులు కాస్తుంటే ఒక్క లారీ లోడు వస్తే ఎవరికి సరిపోతుందని అధికారులపై పలువురు రైతులు మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు.
Arvapally : అర్వపల్లిలో యూరియా కోసం ఎండలో రైతుల బారులు