సూర్యాపేట, నవంబర్ 19 : మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిపై ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి వాటిని పోస్టు చేస్తూ దుష్ప్రచారానికి పాల్పడుతున్న పలు సోషల్ మీడియా, వాట్సాప్ అకౌంట్స్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
తప్పుడు పోస్టులు పెట్టి ప్రచారం చేస్తున్న రేణుక (ఫేస్బుక్), తెలంగాణ వారియర్ (ఇన్స్టాగ్రామ్), తెలంగాణ స్క్రిబ్ (ట్విట్టర్)లపై బీఆర్ఎస్ లీగల్ సెల్.. స్క్రీన్ షాట్స్, అకౌంట్ లింక్సుతో సహా ఫిర్యాదు చేయగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. తప్పుడు పోస్టులు పెట్టిన వారిని, ఫార్వర్డ్ చేసిన వారికి నోటీసులు జారీ చేసి, అరెస్టు చేయనున్నారు.