కోదాడ, జూన్ 24 : బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా పిల్లలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని సామాజిక కార్యకర్త గుండెపంగు రమేశ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కోదాడలోని బెస్ట్ అవైలబుల్ స్కీమ్‌కు సంబంధించిన పాఠశాలల నిర్వాహకులు గత రెండు సంవత్సరాల నుంచి పిల్లలకు అందించాల్సిన ఫీజు బకాయిలను చెల్లించడం లేదన్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతున్నట్లు తెలిపారు.
రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద ఎస్సీ తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్ కోసం ఎన్నో కలలు కంటూ ఉన్నత స్థానంలో చూడాలని ఆశ పడుతున్నారన్నారు. చిన్నారుల పరిస్థితులను పరిగణలోకి తీసుకుని సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు. అధికారులతో, స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి త్వరలోనే సమస్య పరిష్కరిస్తారని కలెక్టర్ భరోసా ఇచ్చినట్లుగా రమేశ్ తెలిపారు. ఆయన కుక్కల కృష్ణ, గంధం, శ్రీను, కలకొండ సైదులు, కుడుముల రాంబాబు, కందుకూరి సురేశ్, బ్రహ్మం, బాల సైదులు, కె.ఉపేందర్, ఎన్.శ్రీను, ఆర్.సైదులు, సుధీర్ పాల్గొన్నారు.