Interview | ‘హుజూర్నగర్ నియోజకవర్గంలో ఏడున్నర దశాబ్దాల్లో జరుగని అభివృద్ధిని కేవలం నాలుగేండ్లలో చేసి చూపించాం. గతంలో ఈ ప్రాంత ప్రజలు ఇచ్చిన అవకాశంతో ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ నేత పదవులు అనుభవించారే తప్ప నియోజకవర్గ అభివృద్ధిని ఎన్నడూ పట్టించుకోలేదు. స్థానికుడినైన నాకు గత ప్రభుత్వాల పాలనలో ఇక్కడి ప్రజలు పడిన ఇబ్బందులు నాకు తెలుసు కాబట్టే, సమస్య ఎక్కడున్నా సత్వర పరిష్కారం కోసం కృషి చేస్తున్నా. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఇప్పటివరకు 4వేల కోట్ల రూపాయలు పనులు చేశాం. అద్దంలా మెరిసే రోడ్లు, రైతులకు ఉపయోగపడే విధంగా లిఫ్ట్‌లు, చెక్ డ్యామ్‌ల నిర్మాణం, ఈఎస్ఐ ఆస్పత్రి, న్యాక్ సెంటర్ వంటివెన్నో ఏర్పాటుచేశాం. అభివృద్ధ్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా పరుగులు పెట్టిస్తున్నాం.
నియోజకవర్గంలో పరిశ్రమలు ఎక్కువగా ఉండడంతో ఇక్కడి యువత కోసం ఐటీఐ కాలేజీని తీసుకొచ్చాను. విద్యార్థినుల్లో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించి వారి కాళ్లపై వారు నిలబడేందుకు పాలిటెక్నిక్ కళాశాల కోసం ప్రయత్నం చేస్తున్నా. త్వరలోనే అది కూడా సాకారమవుతుంది. నియోజకర్గ ప్రజలు నాపై చూపుతున్న అభిమానం వెలకట్టలేనిది. బీఆర్ఎస్ నేతలు, శ్రేణుల సమన్వయంతో హుజూర్‌నగర్‌లో భారీ మెజారిటీతో మళ్లీ గులాబీ జెండాను ఎగురవేస్తాం. గెలుపును సీఎం కేసీఆర్‌కు కానుకగా అందిస్తాం’ అని హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. మరోమారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఖరారైన నేపథ్యంలో నమస్తే తెలంగాణ ఇంటర్యూలో ఎమ్మెల్యే శానంపూడి మరిన్ని విషయాలు పంచుకున్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఎన్నడూ లేనంత ప్రగతి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుభవించారే తప్ప అభివృద్ధిని పట్టించుకోలే..భవిష్యత్ కార్యక్రమాలపై స్పష్టమైన ప్రణాళిక భారీ మెజార్టీతో మళ్లీ గులాబీ జెండా ఎగురవేస్తాం సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
‘హుజూర్నగర్ నియోజకవర్గం సమైక్య పాలనలో అభివృద్ధికి నోచలేదు. నాడు పదవుల కోసం పని చేసే నాయకులే ఉన్నారు గానీ జనం కోసం ఏమీ చేయలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో హుజూర్నగర్ ప్రగతి బాట పట్టింది. నాలుగున్నరేండ్లలో నాలుగు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాం. ఎన్నో కొత్త భవనాలు నిర్మించాం. ప్రజలకు కావాల్సిన వనరులను సమకూర్చుతున్నాం. స్థానికుడిగా ప్రజల మధ్య ఉండే నాయకుడిని నేను. ఏ సమస్య వచ్చినా ప్రజలు నా దగ్గరికి వచ్చి చెప్పుకొనేంత ఆప్యాయత ఉంది. ప్రజలు గతంలో, ఇప్పటికి తేడాను గమనించాలి. ప్రజలే నా బలం, సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మరోసారి గులాబీ జెండా ఎగురవేస్తాం’ అని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే : నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కట్టిన నాటి నుంచి చేయని కాల్వ లైనింగ్ పనులను రూ. 279 కోట్లు, ముత్యాల మేజర్, జాన్‌పహాడ్ లిఫ్ట్ కోసం సుమారు రూ.2వేలకోట్లతో పనులు చేపట్టాం. ఇవే కాకుండా ఆర్డీఓ కార్యాలయం, ఈఎస్ఐ ఆసుపత్రి, న్యాక్ సెంటర్, 12 జూనియర్ కళాశాలలు, ఐటీఐ కాలేజీ, బంజారా భవన్, రూ.100కోట్లతో రోడ్లు నిర్మించాం. నేడు సీసీ రోడ్డు లేని వీధులు లేవు. అదనపు జిల్లా కోర్టు, మూసీ నదిపై చెక్‌డ్యామ్‌లు నిర్మించాం.
ఎమ్మెల్యే : గత కాంగ్రెస్ హయాంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు సంవత్సరంలో రెండు కూడా వచ్చేవి కావు. 2018 నుంచి 2023 మార్చి వరకు 2,787 మందికి రూ. 11,16,92,540 మంజూరు చేయించా. సుమారు 200 మందికి ఎల్ఓసీలు ఇప్పించా. కరోనా సమయంలో ఎంతో మందిని ఆసుపత్రుల్లో చేర్పించి ప్రాణాలు కాపాడిన. నిరుద్యోగ యువతి కోసం అంకిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి క్లాసులు చెప్పించా. యువతకు వారి కాళ్లమీద వారు నిలబడేలా వారికి సలహాలు, సూచనలు అందించా. ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందే విధంగా చూస్తున్నా.
ఎమ్మెల్యే : నేను నియోజకవర్గం కోసం చేస్తున్న అభివృద్ధిపై ప్రజల్లో నమ్మకం ఏర్పడింది. దానిని చూసి సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, హరీశ్‌రావు నాకు మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించారు. ఇప్పుడు నాపైన ఇంకా బాధ్యత పెరిగింది. ఇప్పుడు చేసిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అత్యధిక నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా. నా పైన పెట్టుకొన్న నమ్మకాన్ని వమ్ముచేయను.
ఎమ్మెల్యే : నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్యనే పోటీ ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మా దరిదాపులోకి కూడా రాదు. మాకు మేమే పోటీ. నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు ఇన్నాళ్లు పదవులు అనుభవించాడే గానీ చేసిన అభివృద్ధి ఏమీ లేదు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి జరుగని అభివృద్ధి స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో జరిగింది.
ఎమ్మెల్యే : నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న ప్రభుత్వ పథకాల గురించి ఎవరి వద్దకు వెళ్లి అడిగినా వారే వివరిస్తారు. ప్రతి ఇంట్లో ఏదో ఒక విధంగా ప్రభుత్వం నుంచి లబ్ధిపొందుతున్న వారే ఉన్నారు. దేశంలోని ఇతర రాష్ర్టాలు మన దగ్గర అమలవుతున్న పథకాలను కాఫీ కొట్టడం ఇక్కడి గొప్పతనానికి నిదర్శనం. రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు, వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పతకాలు ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమం సమ పాలనలో నడిపించిన ప్రభుత్వం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమే.