సంస్థాన్ నారాయణపురం, జనవరి 24 : రాష్ట్రం మొత్తం ఒకే మద్యం పాలసీ అమలులో ఉంటుందని ప్రభుత్వం చెబుతున్నా మునుగోడులో మాత్రం ఆ పాలసీ అమలు కావడంలేదు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కో మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన రూల్సే పాటిస్తామని ఎక్సైజ్ శాఖ సిబ్బంది చెప్పడం విడ్డురంగా ఉంది. మద్యం షాపులు ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వ నిబంధన.
అయితే మునుగోడులో మాత్రం ఎమ్మెల్యే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి పది గంటల వరకు వైన్ షా పులు తెరవాలని, సాయంత్రం ఆరు గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే సిట్టింగ్ నడిపించాలని హుకుం జారీ చేశారు. దీంతో ఎక్సైజ్ శాఖ అధికారులకు ఎమ్మెల్యేకు ఎదురు చెప్పే పరిస్థితి లేకపోవడంతో ఆయన చెప్పిన రూల్స్ మేరకే మద్యం షాపులు నడిపిస్తున్నారు..
ఎమ్మెల్యే ఆదేశాలు పాటిస్తే తీవ్రంగా నష్టపోతామని భావించిన మద్యం షాపు యజమానులు ఉదయం 10 గంటలకు వైన్ షాపులు తెరుస్తున్నారు. అయితే ఎమ్మెల్యే చెప్పిన రూల్స్ పాటించకుండా ఉదయం 10 గంటలకు మద్యం దుకాణాలు ఎలా తెరుస్తారంటూ రాజగోపాల్ రెడ్డి అనుచరులు వైన్ షాపుల నిర్వాహకులను బెదిరిస్తూ బలవంతంగా షాపులు మూయించేస్తున్నారు.
దీంతో మద్యం దుకాణాల నిర్వాహకులు ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎక్సైజ్ అధికారులు రెండు రోజులు నామ మాత్రంగా ఉదయం పది గంటలకే మ ద్యం దుకాణాలు తెరిపించారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలో విధించిన రూల్సే పాటించాలని, లేని పక్షంలో దుకాణాలు నడిపించేందుకు వీల్లేదంటూ రాజగోపాల్ రెడ్డి అనుచరు లు షాపులపై దాడులకు పూనుకుంటున్నారు. అంతే కాకుండా ఎక్సైజ్ అధికారుల సమక్షంలోనే మద్యం షాపులను బంద్ చే యిస్తున్నా.. దుకాణ సిబ్బందిపై దాడులకు దిగుతు న్నా..మాకేం సంబంధం లేదన్నట్లు ఆ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు.
ఎమ్మెల్యే చెప్పిన విధంగానే ము నుగోడులో అధికారులు మధ్యాహ్నం ఒంటి గంట త రువాతే మద్యం షాపులు తెరిపిస్తుండటంతో నిర్వాహకులు తీవ్రంగా నష్టపోతున్నారు. షాపులు బంద్ చేయిస్తూ దాడులకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేసేందుకు కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు వెనుకడుగు వేస్తున్నారని, సమస్యను ఎవరు పట్టించుకుంటారని మద్యం దుకాణాల నిర్వహకులు వాపోతున్నారు.