నాగారం, జూన్ 22 : నాగారం మండలం ఫణిగిరిలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బౌద్ధ క్షేత్రంలో అప్పట్లో బయటపడిన విగ్రహాలలో బౌద్ధ జాతక కథలను తెలిపే తోరణాలు, శిల్పాలు గత సంవత్సరం జూలై, 2023న అంతర్జాతీయ ప్రదర్శన నిమిత్తం అమెరికాలోని న్యూయార్క్, మెట్రోపాలిటన్ మ్యూజియం, దక్షిణ కొరియా సియోల్‌కు తీసుకెళ్లారు.
న్యూయార్క్ మ్యూజియంలో ప్రపంచంలోని పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు, పరిశోధకులు విగ్రహాలను సందర్శించి, భారతదేశంలోని గౌతమ బుద్ధుడి కాలంలోని ప్రజలు వారి కళా నైపుణ్యాన్ని చూసి ప్రపంచానికి భారతీయ నాగరికతను తెలియజేయి. ప్రదర్శన అనంతరం తిరిగి ఫణిగిరిలోని బుద్ధిస్ట్ ఆర్కియాలజీ మ్యూజియానికి వాటిని చేర్చినట్లు పురావస్తు శాఖ ఏడీఏ మల్లు నాయక్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫణిగిరిలో లభించిన బౌద్ధ సంపదకు ప్రపంచ గుర్తింపు లభించిందన్నారు. ఆయన వెంట పురావస్తు శాఖ ఏడీ బుజ్జి, సిబ్బంది గట్టు వీరన్న, చిలుకూరి కార్తిక్, సోమారపు యాకయ్య ఉన్నారు.