శాలిగౌరారం, జూలై 3: ఇందిరమ్మ రాజ్యం అని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలనను తలపిస్తోందని, ప్రభుత్వంపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోలీసులు కేసులు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ విమర్శించారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎన్నికల ముందు 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను బురిడి కొట్టించారని, గెలిచి సుమారు 18 నెలలు గడుస్తున్నా..పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. పోలీసులు కాంగ్రెస్ ఏజెంట్లుగా పని చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ఆఫ్ నాలెడ్జ్ సీఎం అని, ఆయన ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజల దురదృష్టకరమన్నారు.
కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, ఈ కార్ రేస్ అని..ఆ కేసు..ఈ కేసు అని తెలంగాణ జాతిపిత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌పై తప్పుడు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతున్నారే తప్ప రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడంలేదంటూ దుమ్మెత్తి పోశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో కొత్తరకం డ్రామా ఆడుతున్నారని అన్నారు.
మహాటీవీ యాజమాన్యం క్షమాపణ చెప్పాలి
కేసీఆర్ ఫ్యామిలీపై అసత్య ప్రసారం చేసిన మహాటివీ యాజమాన్యం తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపోసి అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారని అన్నా రు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అయితగోని వెంకన్నగౌడ్, కట్టా వెంకట్‌రెడ్డి, గుండా శ్రీనివాస్, మామిడి సర్వయ్య, గుజిలాల్ శేఖర్‌బాబు, జెర్రపోతుల చంద్రమౌళిగౌడ్, భూప తి ఉపేందర్‌గౌడ్, అక్కెనపెల్లి శ్రీరాములు, దుబ్బ వెంకన్న, పాక రాములు, దాసరి వెంకన్న, చివుట సైదులు, చింతల శంకర్, నోముల శ్రీనివాస్, తీగల వెంకన్న, సైదులు, పున్నమినాగులు, విజ య్, గోపి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.