సూర్యాపేట టౌన్/ నకిరేకల్, డిసెంబర్ 17 : సూర్యాపేట మున్సిపాలిటీకి చెందిన పారిశుధ్య కార్మికులు మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కేటీఆర్, జిల్లా మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని మంగళవారం హైదరాబాద్‌లో కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు వెంపటి గురూజీ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభు త్వం మాత్రం మూడేండ్ల కింద కిందట 30శాతం పీఆర్సీని పెంచిందని, కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చి సంవత్సరం అయినా కార్మికులకు వేతనాలు పెంచలేదని వాపోయారు. నెలల తరబడి పీఎఫ్, ఈఎస్ఐను కార్మికుల ఖాతాలో జమ చేయడం లేదని తెలిపారు.
సమస్యలపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కమిషనర్ స్పందించడం లేదని పేర్కొన్నారు. గతంలో పోరాడి సాధించుకున్న క్యాజువల్ లీవ్స్ అమలు కావడం లేదని, కార్మికులపై అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని వాపోయారు. ఈ సమస్యల పరిష్కారంతోపాటు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇప్పించేందుకు కృషి చేయాలని కోరారు. మాజీ మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి స్పందిస్తూ కార్మికులకు న్యాయం జరిగేలా అసెంబ్లీలో పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలోబీఆర్టీయూ మున్సిపల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సిలివేరు ప్రభాకర్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రూప్సింగ్, బీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ, వేముల మారయ్య, గురూజీ, వెంకట్రాది, సోమయ్య, భిక్షం, గంధమల్ల మల్లేశ్, ప్రసాద్ కృష్ణ, ప్రవీణ్, దేవీప్రసాద్, సంపత్,యాదగిరి, శ్రీను, నాగేశ్వరావు ఉన్నారు. సూర్యాపేట మున్సిపల్ కార్మికుల సోమయ్య, వెంకటాద్రి పాల్గొన్నారు.