మునుగోడు, జనవరి 23 : బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మునుగోడు సర్పంచ్ రమాదేవి అన్నారు. అశ్రీత స్వచ్చంధ సంస్థ-జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్స్ సహకారంతో బాల్య వివాహల నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన “బాల్య వివాహ విముక్త్” పోస్టర్స్ ను శుక్రవారం మునుగోడు గ్రామ పంచాయతీ ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో నేటికీ ఇంకా బాల్య వివాహాలు జరుగుతున్నాయని, వాటి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. బాల్య వివాహాలు జరగకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పించేదుకు స్వచ్చంధ సంస్థలు, ప్రభుత్వం కృషి చేస్తున్నాయని, సమాజంలో మరింత చైతన్యం తెచ్చేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న 100 రోజుల బాల్య వివాహ విముక్త్ భారత్ కాంపెయిన్ లో భాగంగా “అశ్రీత సంస్థ- జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్” సహకారంతో “బాల్య వివాహ విముక్త్ రథ యాత్ర” చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ లావణ్య కుమారి, ఏసీడీపీఓ వెంకటమ్మ, వార్డు సభ్యులు, ఐసిడిఎస్ సూపర్వైజర్ శివేష, అశ్రీత ఎన్జీఓ కోఆర్డినేటర్ శోభారాణి, ధనమ్మ, డిసిపియు సిబ్బంది రేవతి, అంగన్వాడీ టీచర్ పద్మ పాల్గొన్నారు.