‘గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును బాధ్యతగా తీసుకోవాలి’
రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని, అలాగే గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును బాధ్యతగా తీసుకోవాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కోర్టు ఆవరణలోని...
– న్యాయవాదులకు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పిలుపు
– యువత, నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ అభ్యర్ది ఏనుగుల రాకేష్ రెడ్డికి మద్దతివ్వాలి విన్నపం
రామగిరి, అక్టోబర్ 30 : రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని, అలాగే గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును బాధ్యతగా తీసుకోవాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మరువలేనిదని అన్నారు. ఉద్యమానికి ఎప్పటికప్పుడు న్యాయ సలహాలు అందిస్తూ ముందుకు నడిపించారని, ఉద్యమకారులు కేసులు ఎదుర్కొన్న సమయంలో పలువురు న్యాయవాదులు ఉచితంగా న్యాయ సహాయం అందించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల వల్ల తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన విమర్శించారు. మేధావులైన న్యాయవాదులు ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించి చైతన్యపరచాలని కోరారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల రాకేష్ రెడ్డికి న్యాయవాదులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి ఎదురైనా యువత, నిరుద్యోగులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్నారని పేర్కొన్నారు. ముందుగా అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా తమ పరిధిలో అవగాహన కల్పించాలని, కుటుంబ సభ్యులు, స్నేహితులను కూడా నమోదు చేయించాలని కోరారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ సహకరిస్తానని, వారికి అండగా ఉంటానని కంచర్ల భూపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ. సతీష్ కుమార్, కార్యదర్శి అశోక్, సీనియర్ న్యాయవాదులు గుండె వెంకటేశ్వర్లు, మునగాల నారాయణరావు, జి. జవహర్, సిరిగిరి వెంకట్ రెడ్డి, లోడంగి గోవర్ధన్, యడవెల్లి సింగిల్ విండో చైర్మన్ దోటి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి, న్యాయవాదులు యాదగిరి, ప్రవీణ్ కుమార్, ఏ. వెంకట్ రెడ్డి, మంద నాగేష్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును బాధ్యతగా తీసుకోవాలి’
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Nora Fatehi | నోరా ఫతేహికి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు
Samantha | తొమ్మిదో నెలలోనూ సమంత వర్కౌట్స్.. ‘ఫైనల్ ల్యాప్’ అంటూ ఆసక్తికర పోస్ట్!
Health tips | రాత్రి ధనియాలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

