తుంగతుర్తి, నవంబర్ 17 : ప్రతి ఒక్కరు రైతు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర రైతు కమిషన్ మెంబర్ భూమి సునీల్ అన్నారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని పలువురు రైతుల పంట పొలాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. రైతులు భూ చట్టలపై అవగాహన కలిగి ఉంటే భూ సమస్య పరిష్కారానికి దోహద పడుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయా చుట్టూ, అధికారుల చుట్టూ సంవత్సరాల పాటు తిరిగే పరిస్థితి ఉండదన్నారు. రైతుల సమస్యలు తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి పలువురు రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తాసీల్దారు దయానందం, అగ్రికల్చర్ ఏడీఓ అశోక్, ఆర్ఐ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.