ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపునకు అంతా కృషి చేయాలి : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
నల్లగొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపునకు అంతా కృషి చేయాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి హాజరై మాట్లాడారు.
తుంగతుర్తి, అక్టోబర్ 30 : నల్లగొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపునకు అంతా కృషి చేయాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి హాజరై మాట్లాడారు. నిరుద్యోగులు, టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, మేధావులను సమన్వయం చేసుకుంటూ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పని చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ దందా మీద ఉన్న ధ్యాస ప్రజల అవసరాలపై, రాష్ట్ర అభివృద్ధిపై లేదని ఆరోపించారు. 18 నెలల క్రితమే పలువురు నిపుణులు, శాస్త్రవేత్తలు ఎల్‌నినో పై హెచ్చరించినా, ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పినా ఈ అసమర్ధత, చదువు సంధ్యారాణి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకోలేదని దుయ్యబట్టారు. వచ్చే గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో పట్టభద్రులు కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు.

ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపునకు అంతా కృషి చేయాలి : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని ఎండగట్టాలని బీఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గ సమన్యాయకర్త వై.వెంకటేశ్వర్లు అన్నారు. కాంగ్రెస్ నిరుద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న నిరుద్యోగులను కలిసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసే విధంగా కృషి చేయాలన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావు మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్లు ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య, తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి, మద్దిరాల మండలాధ్యక్షుడు ఎస్ఏ రజాక్, నూతనకల్ మండలాధ్యక్షుడు మున్నా మల్లయ్య యాదవ్, నాగారం మండలాధ్యక్షుడు కలెట్లపల్లి ఉప్పలయ్య, జాజిరెడ్డిగూడెం మండలాధ్యక్షుడు గుండగాని సోమేష్ గౌడ్, జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, దావూల వీరప్రసాద్, మాజీ వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం, దొంగరి శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు, ఆయా గ్రామాల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జిలు, మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపునకు అంతా కృషి చేయాలి : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
MLC Dasoju Shravan Kumar | గ్రాడ్యుయేట్స్ నడుం బిగించి ముందుకు రావాలి : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు యువకులు మృతి
Ori Nayano | హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘ఓరి నాయనో’ చిత్రం!
Watch: ఐఎన్ఎస్ విక్రాంత్‌పై.. రాఫెల్ మెరైన్ తొలి ల్యాండింగ్ అండ్ టేకాఫ్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

