నకిరేకల్, జూన్ 05 : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, విధిగా అందరూ మొక్కలు నాటాలని నకిరేకల్ మున్సిపల్ చైర్పర్సన్ చౌగోని రజితశ్రీనివాస్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నకిరేకల్ పట్టణంలోని కాలంవారికుంట కట్టపై కౌన్సిలర్లతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోజురోజుకు కాలుష్యం పెరుగుతున్న క్రమంలో చెట్లు నాటడమే ఇందుకు పరిష్కారం అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రశీద్, కౌన్సిలర్లు కందాల భిక్షంరెడ్డి, రాచకొండ సునీల్, బానోతు వెంకన్న, గాజుల సుకన్య, పోతుల రవీందర్, చౌగోని లక్ష్మణ్, కందాల పాపిరెడ్డి, పన్నాల రాఘవరెడ్డి, మురారిశెట్టి కృష్ణమూర్తి పాల్గొన్నారు.