– నల్లగొండలో ఘనంగా ఇంజనీర్స్ డే
నల్లగొండ, సెప్టెంబర్ 15 : సమాజంలో ఇంజినీర్లది కీలక పాత్ర అని రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ బండారు ప్రసాద్ అన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా నల్లగొండ క్రెడాయ్ చాప్టర్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే ను సోమవారం సముద్రా ఇన్ రెస్టారెంట్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంజినీర్లు ఆనాటి నాటి నుండి ఈనాటి వరకు నైపుణ్యంతో కట్టిన ప్రాజెక్టులు, భవనాలు నేటి తరానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయని, ప్రాజెక్టుల ద్వారా రైతులు, ప్రజలు ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారన్నారు. ఇంజినీర్లు సమాజంలో కీలకమైన పాత్ర పోషిస్తారని, వాళ్లు గణితం, సైన్స్ సూత్రాలను ఉపయోగించి సమస్యలను పరిష్కరిస్తారు. దీనివల్ల మన దైనందిన జీవితం సులభం, సురక్షితం అవుతుందని తెలిపారు. ఇంజినీర్లు కొత్త పరికరాలు, యంత్రాలు, నిర్మాణాలను రూపొందిస్తారని. స్మార్ట్ఫోన్ల నుండి అంతరిక్ష నౌకల వరకు, ప్రతి ఆవిష్కరణ వెనుక ఇంజినీర్ల కృషి ఉంటుందన్నారు.
మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో ఎదురయ్యే క్లిష్టమైన సమస్యలకు ఇంజినీర్లు ఆచరణాత్మక పరిష్కారాలను కనుగొంటారన్నారు. కాలుష్యాన్ని తగ్గించడం, తాగునీటిని శుద్ధి చేయడం, రవాణా వ్యవస్థను మెరుగుపరచడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రోడ్లు, వంతెనలు, భవనాలు, ఆనకట్టలు వంటి మౌలిక సదుపాయాలను నిర్మించడంలో ఇంజినీర్లు కీలక పాత్ర పోషిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఈఈ వెంకటేశ్వర్లు, ఇంజినీర్ నాంపల్లి మనోహర్, మున్సిపల్ ఏఈ దిలీప్ భార్గవ్, ఇంజినీర్లు ఎం.రామారావు, అల్లి మల్లికార్జున్, ఆవుల శ్రీనివాస్, పృథ్వీరాజ్, బొడ్డుపల్లి సతీశ్, అలుగుబెల్లి వేణుగోపాల్, మిట్టపల్లి సాయి సంతోష్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆమంచి రాజలింగం, దూదిపాల వెంకట్రెడ్డి, సముద్రాల శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, వంగాల అనిల్ రెడ్డి పాల్గొన్నారు.
Nalgonda : సమాజంలో ఇంజినీర్ల పాత్ర కీలకం : బండారు ప్రసాద్