ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యా యత్నం
కోదాడలోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని కళాశాల భవనంపై నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. విద్యార్థినులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామానికి చెందిన బూరుగు మైనా (22) కళాశాలలో ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతోంది.
- కోదాడలోని కిట్స్ కళాశాల భవనం పైనుంచి దూకిన మైనా
- మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలింపు
కోదాడ, ఏప్రిల్ 4 : కోదాడలోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని కళాశాల భవనంపై నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. విద్యార్థినులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామానికి చెందిన బూరుగు మైనా (22) కళాశాలలో ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతోంది. ఫోన్లో ఎవరితోనే మాట్లాడుతూ శుక్రవారం రాత్రి హఠాత్తుగా కళాశాల భవనం పై అంతస్తు నుంచి దూకటంతో తలకు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి.
ఇది గమనించిన విద్యార్థినులు, కళాశాల సిబ్బంది వెంటనే ఆమెను కోదాడలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించడంతో వైద్యులు అత్యవసర చికిత్స చేశారు. బలమైన గాయాల వల్ల మైనా పరిస్థితి విషమించడంతో, ఈ సమాచారాన్ని ఆమె తల్లిదండ్రులకు అందజేసి, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. భవనం పై అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు జారి పడిందా.. లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా..అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
గరిడేపల్లి, ఏప్రిల్ 4 : గరిడేపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గరిడేపల్లికి చెందిన గల్లా దుర్గమ్మకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె వేదామృత (17) నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొద టి సంవత్సరం చ దువుతోంది. ఇ టీవల సెలవులు ఇవ్వడంతో ఇంటి వద్దే ఉంటోంది. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలిక ఇంట్లోని ఫ్యా న్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుం ది. తల్లి ఫిర్యాదు మేరకు కే సు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు స్థానిక ఎస్సై చలికంటి నరేష్ తెలిపారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపగా.. కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

