‘అర్హులు చేయూత పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోవాలి’
ప్రభుత్వ చేయూత పెన్షన్ ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించిందని చండూరు ఎంపీడీఓ బండారు యాదగిరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు...
– చండూరు ఎంపీడీఓ బండారు యాదగిరి
చండూరు, సెప్టెంబర్ 01 : ప్రభుత్వ చేయూత పెన్షన్ ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించిందని చండూరు ఎంపీడీఓ బండారు యాదగిరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, పైలేరియా పేషెంట్లు, తలసేమియా, సికిల్‌సెల్ డిసీజెస్ పెన్షన్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీగా నిర్ణయించగా తాజాగా ఆ గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించినట్లు తెలిపారు. దరఖాస్తుదారులు గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తులను అందజేసి రసీదులు పొందాలని సూచించారు. ఆగస్టు 31 వరకు చండూరు మండలంలో 611 మంది పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో వితంతువులు 245, ఒంటరి మహిళలు 29, దివ్యాంగులు 130, చేనేత కార్మికులు 05, గీత కార్మికులు 202 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఎంపీడీఓ వెల్లడించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

