నల్లగొండ సిటీ ఏప్రిల్ 15 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆర్టిజన్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందంటూ విద్యుత్ ఆర్జిజన్ కార్మికుల ఆధ్వర్యంలో గత వారం రోజులుగా ధర్నా నిర్వహిస్తున్నారు. విద్యుత్ సిబ్బందికి ప్రత్యేక గుర్తింపును తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకవచ్చిందన్నారు. దీంతో మన రాష్ట్రం ఇతర రాష్ర్టాలకు విద్యుత్తును విక్రయించే స్థాయికి ఎదిగిందన్నారు. ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయన్నారు. కాంట్రాక్టుగా పనిచేసిన వారిని బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించి మెదటి పీఆర్సీ ఎలక్ట్రిసిటీ ఉద్యోగులకే అమలు చేసిందన్నారు. దీంతో విద్యుత్ ఉద్యోగుల వేతనాలు పెరిగాయన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు విద్యుత్ ఆర్టిజన్లను రెగ్యులర్ చేయడంతో పాటు అన్ మ్యాన్డ్, పీస్‌రేట్ కార్మికులను ఆర్టిజన్లుగా మారుస్తామని హమీ ఇచ్చి, మోసగించిందన్నారు.
విద్యుత్ కార్మికులకు గత ప్రభుత్వ హయాంలో గుర్తింపు వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను విస్మరించి మోసం చేసింది. మా డిమాండ్ల కోసం గత వారం రోజులుగా ధార్నా చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం హమీలు అమలు చేయకపోతే తగిన బుద్ధిచెబుతాం.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన గారడీమాటలు నమ్మి మోసపోయాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా విద్యుత్ ఆర్టిజన్లకు ఇచ్చిన ఏ ఒక్క హమీ అమలు చేయలేదు. మా న్యాయమైన డిమాండ్లను అమలు చేయకపోతే జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేస్తాం.