సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్.. 100 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి
సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జ యంతి నాటికి 100 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటుచేయాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆసియా ఖండంలోనే మొదటి బహుజన చక్రవర్తి, గోలొండతో పాటు 33 కోటల ను ఏలిన రాజు పాపన్నగౌడ్ అని తెలిపారు.
- ట్యాంక్‌బండ్‌పై స్థలం కేటాయించాం
- రూ.3 కోట్ల నిధులు మంజూరు చేశాం : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ) : సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి నాటికి 100 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటుచేయాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆసియా ఖండంలోనే మొదటి బహుజన చక్రవర్తి, గోలొండతో పాటు 33 కోటల ను ఏలిన రాజు పాపన్నగౌడ్ అని తెలిపారు. ఆగస్టు 10న రవీంద్ర భారతిలో నిర్వహించనున్న పాపన్నగౌడ్ 376వ జయంతి ఉత్సవాల ఆహ్వానపత్రాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌కు జై గౌడ్ ఉద్యమ క మిటీ నాయకులు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఉత్సవాల పోస్టర్‌ను ఆ విషరించారు.
శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ పాపన్నగౌడ్ సేవలను భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ హయాంలో ట్యాంక్‌బండ్‌పై విగ్రహ ఏర్పాటుకోసం స్థ లాన్ని కేటాయించి రూ.3 కోట్లు మంజూరు చేశామని గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన జయంతి నాటికి 100 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చే యాలని డిమాండ్ చేశారు. చెట్లపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను వెంటనే అందించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జిల్లాగా నామకరణం చేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, జై గౌడ్ ఉద్యమం రాష్ట్ర అధ్యక్షుడు గుండ్రాతి నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

