కొండామల్లేపల్లి, డిసెంబర్ 05 : స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరపాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు కొర్ర లక్ష్మి అన్నారు. శుక్రవారం కొండామల్లేపల్లి మండలంలోని కేశ్య తండ నామినేషన్ కేంద్రాన్ని ఆమె సందర్శించి నామినేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలను బకడ్బందీగా నిర్వహించాలని, నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి తీసుకోవాలని అధికారులకు సూచించారు. స్వీకరించిన పత్రాలను వెంటనే ఆన్లైన్ చేయాలన్నారు. అభ్యర్థులు అధికారులకు సహకరించాలన్నారు. ఆమె వెంట ఆర్డీఓ రమణారెడ్డి, ఎంపీడఓ స్వర్ణలత, తాసీల్దార్ నరేందర్, ఎస్ఐ అజ్మీరా రమేశ్ ఉన్నారు.