మీలో ఒకడిని.. మరోసారి ఆశీర్వదించండి
మీలో ఒకడిని.. మీ కష్టసుఖాల్లో తోడుగా ఉంటా.. కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ నకిరేకల్ అభ్యర్థి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరారు. నార్కట్‌పల్లి, ఔరవాణి, బ్రాహ్మణ వెల్లెంల గ్రామాల్లో జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డితో కలిసి శనివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
- ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
- నార్కట్‌పల్లి మండలంలో జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డితో కలిసి ప్రచారం
నార్కట్‌పల్లి, నవంబర్ 25 : మీలో ఒకడిని.. మీ కష్టసుఖాల్లో తోడుగా ఉంటా.. కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ నకిరేకల్ అభ్యర్థి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరారు. నార్కట్‌పల్లి, ఔరవాణి, బ్రాహ్మణ వెల్లెంల గ్రామాల్లో జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డితో కలిసి శనివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ తిరుగుతూ ఓటు అభ్యర్థ్ధించారు. గ్రామస్తులు పూలమాలతో సత్కరించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అహర్నిశలు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తానని నియోజకవర్గ అభివృద్ధ్ది కోసమే పార్టీ మారానని స్పష్టం చేశారు.
మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధ్ది పరిచానని అన్నారు. ఎన్నోఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతోనే పూర్తి చేశారన్నారు. లక్ష ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, రైతు బంధు మండల కన్వీనర్ యానాల అశోక్ రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, సర్పంచులు యానాల మాధవి పాల్గొన్నారు.
ప్రజలకు మంచి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి : చిరుమర్తి

రామన్నపేట : ప్రజలకు మంచి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, బీఆర్ఎస్ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని బీఆర్ఎస్ నకిరేకల్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని లక్ష్మాపురం, కొత్తగూడెం గ్రామాలతో పాటు పట్టణ కేంద్రంలో శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించి కారు గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల కూడళ్లలో మాట్లాడుతూ.. సుస్థిరమైన ప్రభుత్వం బలమైన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ఆయనతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని అన్నారు.
తెలంగాణ ప్రజలు విజ్ఞులని 3 గంటల కరెంట్ ఇస్తామంటున్నా కాంగ్రెస్ కావాల్నో 24 గంటల కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వం కావాల్నో ఆలోచించి ఓటు వేయాలని కోరారు ఎన్నికల ముందు రైతు బంధు పథకాన్ని నిలిపి వేయాలని కాంగ్రెసోళ్లు అడ్డంకులు సృష్టించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతుల పక్షాన పోరాడి రైతుబంధు పథకానికి ఎన్నికల కమిషన్‌ను ఒప్పించారన్నారు. డబ్బులను రైతుల ఖాతాల్లో సోమవారం డబ్బులు జమ కానున్నయన్నారు. రైతులకు అండగా ఉండే ప్రభుత్వానికి మద్దతు పలకాలన్నారు. గ్రామాలు ప్రశాంతంగా అభివృద్ధి సాధించాలంటే ధర్మంకోసం పనిచేసే తనను అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ చెరుకు సుధాకర్, ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, సింగిల్‌విండో చైర్మెన్ నంద్యాల భిక్షంరెడ్డి, మండలప్రధానకార్యదర్శి పోశబోయిన మల్లేశం, సర్పంచులు ఉప్పు ప్రకాష్, ఎడ్ల మహేందర్‌రెడ్డి, బందెల రాములు, అంతటి రమేష్, బత్తుల శంకరయ్య, ముక్కాంముల దుర్గయ్య, సాల్వేరు అశోక్, కొండల్‌రెడ్డి, బద్దుల రమేశ్,ఎస్కే చాంద్, యువజన సంఘం మండలాధ్యక్షుడు బత్తుల వెంకటేశం, పట్టణ అధ్యక్షకార్యదర్శులు పోతరాజు సాయికుమార్, జాడ సంతోష్, ఉప సర్పంచులు బత్తిని మహేశ్, గండికోట ఆంజనేయులు గ్రామశాఖ అధ్యక్షులు కోయగూరి వెంకటేశ్, బద్దం శ్రీను, పులిపలుపుల వీరస్వామి, అనంతచారి, బద్దం గోపాల్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

